calender_icon.png 19 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం 17వ వార్డులో గావ్ చలో – బస్తీ చలో కార్యక్రమం విజయవంతం

12-04-2025 06:54:56 PM

భద్రాచలం (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం 17వ వార్డులో నిర్వహించిన గావ్ చలో – బస్తీ చలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రజలను కలుసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ షాపు వద్ద గరీబ్ అన్నా కళ్యాణ్ యోజన పథకానికి సంబంధించిన ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ఫోటోతో కూడిన బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. రేషన్ షాపులో ఈ బోర్డు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మా, రేషన్ షాపు వారిని హెచ్చరించారు. తక్షణమే బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కుంజా ధర్మా మాట్లాడుతూ... "కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి గరీబ్ అన్నా కళ్యాణ్ యోజన ద్వారా నెలకు 5 కేజీల ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి, దేశవ్యాప్తంగా 85 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది. కేంద్రం ఒక్కో కేజీకి రూ. 40 ఖర్చు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కేజీ సన్న బియ్యం మాత్రమే ఇస్తూ, మేమే ఇస్తున్నామని ప్రచారం చేస్తోంది.

రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి ఫోటోను కూడా పెట్టకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు ఇంచార్జి సీనియర్ నాయకులు మునిశెట్టి రామ్ మోహన్ రావు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు మునిశెట్టి నిఖిల్, అన్నం హరీష్, అన్నం సాయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ అందుకుంటున్న లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.