13-04-2025 05:51:33 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): అభియాన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదివారం కామారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో గావ్ చలో-బస్తీ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు సమావేశం నిర్వహించారు , కాలని వాసులకు కరపత్రాలు ఇచ్చి బీజేపీ సాధించిన విజయాలు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన BJYM పట్టణ ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సంస్థాగత కార్యక్రమాలలో భాగంగా దేశంలోని అన్ని గ్రామాలు, పట్టణంలోని వార్డులలో గావ్ చలో - బస్తీ చలో అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
పార్టీ గత 45 సంవత్సరాలలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో సాధించాలని పెట్టుకున్న లక్యాలు ప్రతి కార్యకర్త తో పాటు ప్రజలకు కూడా వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోతుందని, విప్లవాత్మక సంస్కరణలు, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం, భవిష్యత్తు ప్రణాళిక లు ఇలా అన్ని రంగాలలో సమతూకంగా భారత్ ముందుకి వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మురళీధర్ గౌడ్ ముద్దాం హరీష్, విపుల్ జైన్, నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, పిల్లి మల్లేష్, యాదవ్, తదితరులు పాల్గొన్నారు.