calender_icon.png 16 January, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి రవాణా ముఠా అరెస్ట్

10-09-2024 01:06:54 PM

కర్ణాటక చెందిన ముఠా నుంచి 140 కిలోల గంజాయి స్వాధీనం 

గంజాయి విలువ 35 లక్షలు

గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు

సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్

సంగారెడ్డి, (విజయక్రాంతి): ఒరిస్సా - ఆంధ్ర సరిహద్దు నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ డివిజన్లోని చిరాకుపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎండు గంజాయి వివరాలు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర సరిహద్దులోని మాటికి చౌరస్తా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎండు గంజాయి తరలిస్తున్న వాహానాన్ని గుర్తించారు. మహేంద్ర  బొలెరా మ్యాక్స్ పికప్ వాహనంలో 140 కిలోల ఎండు గంజాయిని ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులతోపాటు చిలకలు ఎస్ఐ రాజేందర్ రెడ్డి వాహనాలు కనిపిస్తుండగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి స్మగ్లింగ్ వివరాలు తెలియడం జరిగిందన్నారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా వైట్ కలర్ మహేంద్ర బుల్లోరా పికప్ వాహనంలో బీదర్ జిల్లాలోని బాల్కి తాలూకా షాపూర్ వాడి గ్రామానికి చెందిన లండన్ (29) , బీదర్ పట్టణంలోని బసవేశ్వర్ చౌక్ బీర్దేవ్గల్లి చెందిన సిద్ధిరాం (28) ఎండు గంజాయిని తరలిస్తున్నారని గుర్తించామన్నారు. కర్ణాటకలోని బాల్ కి చెందిన నల్గొండ ఎండు గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి నుండి రాహుల్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేశారన్నారు.

ఎండు గంజాయిని లకం సిద్ధిరాం సునీల్ కిరణ్ మల్లేష్ నాయకుల దారు వాహనాలలో తరలిస్తున్నారు. ఎండు గంజాయి వాహనంలో తీసుకుపోయి నల్గొండకు అప్పగిస్తారని తెలిపారు. నల్గొండ ముంబై పూణే లాతూర్ తదితర పట్టణాలలో అమ్మకం చేస్తారన్నారు. గంజాయి తరలిస్తున్న లకన్ సిద్ధిరాములు అరెస్టు చేశామన్నారు. మలిగొండ రాహుల్ కిరణ్ సునీల్ మల్లేష్ నాయక్ లు పరార్ లో ఉన్నారన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి పట్టణ సిఐ శివలింగం సిసిఎస్ సిఐ మల్లేశం ఎస్బి ఇన్స్పెక్టర్ రమేష్ విజయ్ సిసిఎస్ఐ శ్రీకాంత్ చెరకు ఎస్ఐ రాజేందర్ రెడ్డి జరా సంఘం ఎస్సై నరేష్ తదితరులున్నారు.