calender_icon.png 22 December, 2024 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి స్మగ్లర్ అరెస్ట్

16-09-2024 07:11:17 PM

జహీరాబాద్,(విజయక్రాంతి): జహీరాబాద్ మండలంలోని షేకాపూర్ తాండ చెందిన రాథోడ్ హరి ఇలియాస్ అర్జున్ రాథోడ్, చౌహాన్ అర్జున్, చౌహాన్ విజయ్, పవర్ వేణు, చౌహాన్ సతీష్ ఇలియాస్ కిరణ్ వీరందరూ గత కొన్ని సంవత్సరాలు నుండి కొత్తగూడెం ఒరిస్సా బోర్డర్ ఏరియా, బీదర్ నుండి నిషేధిత గంజాయి తీసుకొని వచ్చి జహీరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అమ్ముతున్నారు నమ్మదగిన సమాచారం రావడంతో దాడి చేసి అరెస్టు చేశామని జహీరాబాద్ రూరల్ ఎస్సై ప్రసాద్ రావు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం... సోమవారం జహీరాబాద్ పోలీస్ స్టేషన్ హుగ్గేల్లి గ్రామ శివారులోని షాలిమార్ హోటల్ వెనుకగల శిరీష వెంచర్ నందు వీరందరూ కలిసి చిన్న చిన్న పాకెట్లు గా చేసి గంజాయి అమ్ముతుండగా పోలీసు వారు వెళ్లగా వారిని చూసి నలుగురు వ్యక్తులు పారిపోయినారు.

దానిలో నుండి రాథోడ్ హరి ఇలియాస్ అర్జున్ రాథోడ్ దొరకగా అతని పట్టుకున్నాం. అతని వద్ద నుండి సుమారు 5 కిలోల గంజాయి పాకెట్లు స్వాధీను పరుచుకున్నాము ఇట్టి ఐదుగురి వ్యక్తులపై జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదైయింది. రాథోడ్ హరి ఇలియాస్ అర్జున్ రాథోడ్ని ఈరోజు రిమాండ్కు పంపనైనది మిగతా వ్యక్తులని త్వరలోనే పట్టుకొని రిమాండ్కు పంపబడును అలాగే గతంలో రాథోడ్ హరి ఇలియాస్ అర్జున్ రాథోడ్, చౌహాన్ సతీష్ ఎలియాస్ కిరణ్ లపై కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ నందు కూడా ఈ సంవత్సరం జూన్ నెలలో గంజాయి కేసు  నమోదైందని, వీరిద్దరూ అప్పటినుంచి పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నన్నారు.