హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22(విజయక్రాంతి): మాదాపూ ర్‌లోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో పలువురు వ్యక్తులు డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ టీం పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నవదీప్, సాయిచరణ్‌ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3.2గ్రాముల డ్రగ్స్, 66గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు తెలిపారు.
హర్యానా మద్యం..
నాచారంలో కార్తికేయ నగర్‌లోని ఒక ఇంట్లో ఎన్డీపీ మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ టీం పోలీసులు శనివారం రాత్రి అక్షిత్ అనే వ్యక్తి ఇంట్లో దాడులు నిర్వహించారు. ఢిల్లీ, హర్యానాకు చెందిన రూ.లక్షన్నర విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను శశాంక్ తీసుకువచ్చినట్లు నిందితుడు వెల్లడించాడు.