20-02-2025 12:49:29 PM
అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధి రామోజీ ఫిలింసిటీ(Ramoji Film City) వద్ద గురువారం తెల్లవారుజామున భారీ ఎత్తున గంజాయి పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ గంజాయి తరలిస్తున్న విశ్వనీయ సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు(Maheshwaram SOT Police) ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో వైజాగ్ నుంచి హైదరాబాద్(Vizag to Hyderabad) గంజాయి తరలించే ఎంహెచ్ 16సీడీ 2076 నెంబర్ గల కంటైనర్‌ను పట్టుకొని తనిఖీలు చేయగా 300 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి తరలిస్తున్న కంటైనర్ సీజ్‌చేసి, తరలిస్తున్న వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ దాదాపుగా కోటి రూపాయలు ఉండదన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు 3 గంటలకు నిర్వహించబోయే ప్రెస్‌మీట్ లో పోలీస్ అధికారులు వెల్లడించనున్నారు.