calender_icon.png 15 November, 2024 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

15-11-2024 05:27:05 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఒరిస్సా నుంచి హైదారాబాద్‌కు రైల్లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మల్కాజ్ గిరి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ ఎస్టీఏ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన ప్రకారం... గంజాయి రవాణవుతున్నందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ఏ టీమ్‌  శుక్రవారం మల్కాజి గిరి రైల్వే స్టేషన్‌లో  మాటు వేశారు. గంజాయి సంచులతో రైలు దిగిన ఎస్‌కె అహ్మమద్‌ అలీ (రాజమండ్రి)ని పట్టుకుని 17.22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు నిందితుడిని ప్రశ్నించినపుడు ధూల్‌పేట్‌కు చెందిన రాహుల్‌ సింగ్‌కు ఇవ్వడానికి గంజాయి తీసుకువచ్చినట్లు అంగీకరించాడు. ఒరిస్సా చెందిన పాండు అలియాస్‌ పబిత్ర నాయక్‌ హైదరాబాద్‌ ధూల్‌పేట్‌కు చెందిన రాహుల్‌ సింగ్‌కు గంజాయి పంపిస్తాడని నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ సీఐ ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అనంతరం గంజాయిని సీజ్ చేసి నిందితుడిని మల్కాజి గిరి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో అప్పగించారు. 

మరో కేసులో..  4.23 కేజీలు

అప్పర్‌ ధూల్‌పేట్‌ లో గల హాజారీ హోటల్‌ సమీపంలో ఎస్టీఎఫ్, ఎక్సైజ్‌ కలిపి  శక్రవారం నిర్వహించిన రూట్‌ వాచ్ లో నలురుగు నిందితుల వద్ద 4.23 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయితో పట్టుబడిన నలుగురిని విచారించగా మరో ఎనిమిది మందికి గంజాయి అమ్మకాలతో సంబంధాలు ఉన్నాయని నిందితులు వెల్లడిoచారు. గంజాయితో పట్టుబడినవారిలో ఎడిగా గణేష్‌, రాహుల్‌ సింగ్‌, అంకిత్‌, లడ్డు సింగ్‌లు ఉన్నారు. యూసఫ్, చరణ్‌, శంకర్‌, అమన్‌ సింగ్‌, అదర్శసింగ్‌, ముఖేష్‌ సింగ్‌, ఎన్‌కె ఆహ్మమద్‌, సుమరాజ్‌ గులారీలు పరారీలో ఉన్నారు.

రెండు చోట్ల గంజాయిని పట్టుకున్న టీమ్‌లో ఎస్టీఎఫ్ టీమ్‌ లీడర్‌ నంద్యాల అంజి రెడ్డి, ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ సీఐలు మధుబాబు, గోపాల్‌, ఎస్ టి ఎఫ్  సీఐలు మధు, ఎంపిఆర్‌ చందశ్రేఖర్‌, ఎస్ఐలు సాయి కిరణ్‌, భరత్‌కుమార్‌, భాస్కర్‌రెడ్డి  అజీమ్‌, శ్రీధాlర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు ప్రకాష, రాకేష్‌, మహేష్‌ ఉన్నారు. ఎస్ జి ఎఫ్  టీమ్‌లను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌  డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి అభినందించారు.