calender_icon.png 25 October, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక మాటున గంజాయి తరలింపు

12-08-2024 02:03:34 AM

రూ.37లక్షల విలువ గల సరుకు పట్టివేత

భద్రాచలం, ఆగస్టు 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం ఇసుక మాటున తరలిస్తున్న 150కిలోల ఎండు గంజాయని భద్రాచలం బ్రిడ్జిపై ఎక్సైజ్ అధి కారులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి చిత్తూరు మీదుగా తరలిస్తుండగా పట్టుకు న్నారు. ఎస్పీ జానయ్య వివరాలను వెల్లడిం చారు. ట్రాక్టర్ ట్రక్కు కింద భాగాన ప్రత్యే కంగా చానల్ తయారు చేయించి ఎవరికి అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. ఎక్సై జ్ అధికారులు ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నిస్తే డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లి భద్రాచలం బ్రిడ్జి సమీపంలో ట్రాక్టర్‌ను వదిలి పరారయ్యాడు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా రూ.37లక్షల విలు వైన గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. 

ఇల్లెందులో 

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆదివారం రూ.13 లక్షల విలువగల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇల్లెందు డీఎస్పీ ఉదయ్‌భాను తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లెందు సమీపంలోని ఊరుగుట్ట వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వస్తున్న కారును తనిఖీ చేయగా అందులో రూ.13లక్షల విలువైన 53 కిలోల గంజాయి పట్టుబడింది. కారులో ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్టు తెలిపారు.