- గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
- ధూల్‌పేట్‌లో మహిళ అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): డ్రగ్స్‌ను అరికట్టడమే లక్ష్యం గా ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు దాని రవాణా, విక్ర యాల కోసం నూతన మార్గాలు వెతుకుతూ నే ఉన్నారు. తాజాగా ఓ ముఠా గుట్టుచప్పు డు కాకుండా పసుపు ప్యాకెట్లలో గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తుండగా.. సమాచారం అం దుకున్న ఎక్సైజ్ పోలీసులు వారి గుట్టును రట్టు చేశారు. వివరాలు.. ధూల్‌పేట్‌కు చెంది న నేహాబాయి స్థానికంగా పసుపు ప్యాకెట్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అయితే పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందటంతో నిఘా ఉంచి సోమవారం దాడి చేశారు. ఈ దాడుల్లో 10 గంజాయి ప్యాకెట్ల ను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డీఎప్పీ తిరుపతియాదవ్, ఎస్‌ఐ నాగరాజుతో పాటు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.
ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత..
నగరంలోని బల్కంపేటలో ఎక్సైజ్ పోలీసులు 5గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకు ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో బల్కంపే టలో డీటీఎఫ్ టీమ్ సీఐ శిరీష ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. రావిశెట్టి సత్యశివకుమార్, చిక్కుల జ్యోతికిరణ్.. వినియోగదారుడికి డ్రగ్స్ విక్రయించేందుకు బైక్‌పై వెళ్తుండగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఎండీఎంఏ డ్రగ్స్ ఉండటంతో అరెస్ట్ చేశా రు. తమకు కారంశెట్టి వెంకటసాయి దిలీప్ ఈ గంజాయిని అమ్మిపెట్టాలని ఇచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. కాగా దిలీప్ పరారీలో ఉన్నాడు. తనిఖీల్లో సిబ్బంది నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.