హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించారు. దీనిపై స్పందించిన లోకేష్ సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాతామని హామీ ఇచ్చారు. గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.