calender_icon.png 4 February, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండలో బరితెగించిన గంజాయి గ్యాంగ్

03-02-2025 11:12:03 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసిన ఘటన ఆదివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు యువకులు గంజాయి మత్తులో పోచమ్మ కాలనీకి చెందిన యువకుడిని ఈ గ్యాంగ్ చితకబాదింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తున్న సమయంలో యువకుడు పెద్దగ కేకలు వేశాడు.

వెంటనే గమనించిన కాలనీ వాసులు అక్కడకు చేరుకునే లోపు గంజాయి బ్యాచ్ అక్కడి నుంచి పరారైంది. గాయపడిన యువకుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాగా స్థానికులు ఇలాంటి ఘటనలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే యువకుడి పై దాడి చేసిన గ్యాంగ్ పై బాధితుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ బ్యాచ్‌ రాత్రి వేళల్లో తిరుగుతూ అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తూ అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.