5.5 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం
శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): రాయదుర్గం పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రవి కృష్ణ,నాగ పవన్, ఇద్దరూ హైదరాబాద్ నగరానికి వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగించారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడ్డా ఇద్దరు ఈజీ మనీ కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు.కాగా బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ కమిషనరేట్ ఎదురుగా అల్సభ హోటల్ వద్ద గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పక్క సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 5.5 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.