హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలీసులకు దిశానిర్దేశం చేసింది. నిందితులు ఎవరైనా సరే మాదక ద్రవ్యాలతో పట్టుబడితే కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పక్క సమాచారం అందడంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సోదాలు నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా కారణా దుకాణం ముసుగులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారు. ఈ మేరకు వారి నుంచి 9.5 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చాక్లెట్లను విక్రయిస్తున్న కిరాణా షాప్ యజమాని సునీత దేవి గోస్వామిని అరెస్టు చేశారు.