calender_icon.png 17 January, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో గ్యాంగ్‌వార్

21-10-2024 12:00:00 AM

  1. 10 రౌండ్ల కాల్పులు
  2. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురిలో రెండు వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది. ఇది ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకునే వరకు వెళ్లింది. ఇందులో దీపక్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీపక్ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయినట్లు పోలీసులు వెల్లడించారు. నరేంద్ర, దీపక్ అనే మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. దీపక్, అతని సోదరుడితో పాటు మరికొంత మంది స్నేహితులు ఓ పార్కు వద్ద ఉండగా నరేంద్ర, సూరజ్ అక్కడి వచ్చారు. వీరి మధ్య వ్యక్తిగత విషయంలో గొడవ తలెత్తగా కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేంద్ర, దీపక్‌ను అరెస్టు చేశారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు.