calender_icon.png 18 March, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్ శర్మకు గంగూలీ కీలక సందేశం

18-03-2025 09:33:00 AM

హైదరాబాద్: గత ఐదు నెలల్లో భారత క్రికెట్ జట్టు(Indian cricket team) బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పది టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, వాటిలో మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై భారత్ 2-0 సిరీస్ విజయం సాధించగా, న్యూజిలాండ్‌పై పరాజయాలను చవిచూసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో, పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. కానీ ఆ తర్వాత మిగిలిన మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఫలితంగా 1-3 సిరీస్ ఓటమి పాలైంది. ఈ పరిణామాల మధ్య, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma)కు కీలకమైన సలహా ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మరింత బాధ్యత తీసుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరారు.

ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడబోతున్నందున, దీర్ఘకాల ఫార్మాట్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) తన తప్పులను సరిదిద్దుకోవాలని గంగూలీ నొక్కిచెప్పారు. ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాన్ని, వైట్-బాల్ క్రికెట్‌లో అతని విజయాలను గంగూలీ హైలైట్ చేశాడు. రోహిత్ భారత టెస్ట్ జట్టును స్థిరమైన విజయం వైపు నడిపించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. రెడ్-బాల్ క్రికెట్‌లో జట్టు ఇబ్బందులను అంగీకరిస్తూ, ఇంగ్లాండ్‌లో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో బలమైన ప్రదర్శన ఇవ్వడం ప్రాముఖ్యతను గంగూలీ ఎత్తి చూపారు. టెస్ట్ ఫార్మాట్‌లో జట్టును సమర్థవంతంగా నడిపించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని ఆయన రోహిత్ శర్మకు సలహా ఇచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ ఘోరంగా ఓడిపోయాడు.. కానీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అతనికి కొంత ఊరటనిచ్చింది.