calender_icon.png 11 January, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేసింగ్‌లో అడుగుపెట్టిన గంగూలీ

12-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రేసింగ్ క్రీడలో అడుగుపెట్టాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024 జరగనున్న నేపథ్యంలో గంగూలీ.. కోల్‌కతా రాయల్ టైగర్స్ జట్టును కొనుగోలు చేశాడు. ఆగస్టు నెలల్లో జరగనున్న రేసింగ్ ఫెస్టివల్‌లో కోల్‌కతాతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కొచ్చి, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. రేసింగ్ ఫెస్టివల్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్), ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నా యి. ‘మోటోస్పోర్ట్స్ క్రీడ నాకు ఫ్యాషన్. కోల్‌కతా టీమ్‌తో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో నా జర్నీ ప్రారంభించనున్నా’ అని గంగూలీ అన్నాడు.