calender_icon.png 28 September, 2024 | 6:54 AM

ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఓవరాల్ కప్ ను ఆవిష్కరించిన గంగుల

05-09-2024 09:40:06 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ఈనెల 14, 15వ తేదీలలో స్థానిక అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఓవరాల్ కప్ ను కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల తో పాటు, కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, స్థానిక నాయకులు మంతెన కిరణ్, రాష్ట్ర చైర్మన్ వసంత్ కుమార్, ఉపాధ్యక్షులు గౌరు రాజిరెడ్డి, మాడుగుల ప్రవీణ్ లు  పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గంగుల టోర్నమెంట్ ఆర్గనైజర్ ప్రసన్న కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు.సుమారు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 1000 నుండి 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.