calender_icon.png 17 March, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తున్నాం: గంగుల కమలాకర్

17-03-2025 02:14:14 PM

బిల్లును ఆమోదింపజేసుకునే బాధ్యత రేవంత్ రెడ్డిదే: 

హైదరాబాద్: శాసనసభ సమావేశాలు(Telangana Assembly Budget Sessions ) సోమవారం కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC reservation bill)ను స్వాగతిస్తున్నామని, పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందితేనే సంపూర్ణ సంతోషమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బిల్లును ఆహ్వానిస్తూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని గంగుల పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ప్రతిపాదించి విఫలమయ్యాయని గంగుల సూచించారు. ఒక్క తమిళనాడులోనే 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని మాజీ మంత్రి స్పష్టం చేశారు.

తమిళనాడు ఉదంతం పరిశీలించి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. బిల్లును ఆమోదింపజేసుకునే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)దేనని ఆయన తెలిపారు. తమిళనాడులో కులాల ప్రాతిపదికన సర్వేచేశారని వెల్లడించారు. తమిళనాడులో ఏడాదిపాటు సర్వే చేసి నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. తమిళనాడులో బీసీ కమిషన్ ద్వారా సర్వే జరిగిందని గంగుల వ్యాఖ్యానించారు. 1992లో సుప్రీంకోర్టు(Supreme Court of India) చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని గుర్తు చేసిన గంగుల కమలాకర్ రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చని తేల్చిచెప్పింది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చని  సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గంగుల గుర్తుచేశారు. సుప్రీం కోర్టు ఆధారంగా జయలలిత ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.