calender_icon.png 26 January, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సునీల్ పార్టీ మారుతాడని ఊహించాం: గంగుల కమలాకర్

25-01-2025 04:12:59 PM

సునీల్ రావు పార్టీ మారుతాడని ముందే తెలుసు

హైదరాబాద్: కరీంనగర్ మేయర్ సునీల్ రావు పార్టీ మారుతాడని ఊహించామని మాజీ మంత్రి, గంగుల కమలాకర్(Gangula Kamalakar) మీడియాతో అన్నారు. సునీల్ రావు పదవుల కోసమే బీజేపీ పార్టీలో చేరుతున్నాడని ముందే తెలుసని గంగుల పేర్కొన్నారు. అవకాశవాదులు పార్టీ నుంచి వెళ్లిపోతేనే పార్టీ మరింత బలపడుతుందని ఆయన తెలిపారు.

కరీంనగర్ మేయర్ సునీల్ రావు(Karimnagar Mayor Sunil Rao) స్వార్థపరుడని గంగుల ఆరోపించారు. తమ జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సునీల్ రావుకు మేయర్ పదవి ఇవ్వొద్దని గతంలో చెప్పానని  గుర్తుచేశారు. అవినీతి కేసులు తప్పించుకునేందుకే బీజేపీలో చేరారని విమర్శించారు.

బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు పంపారు. హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) సమక్షంలో సునీల్‌రావు శనివారం బీజేపీలో చేరారు. 


గత ఐదేళ్లలో తనకు అండగా నిలిచిన కరీంనగర్ పట్టణ ప్రజలకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహకరించిన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, నాయకులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో పార్టీ కార్యకలాపాల్లో నిష్క్రియంగా మారిన సునీల్‌రావు.. కేంద్రమంత్రి సంజయ్‌కుమార్‌తో సాన్నిహిత్యం పెంచుకుని బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

శుక్రవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌(Manohar Lal Khattar)ను ఆహ్వానించి స్మార్ట్‌ సిటీ పథకం(Smart Cities Mission) కింద చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సునీల్‌రావు ప్రారంభించారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పదవీకాలం జనవరి 28తో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం మేయర్‌ అన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు.