* పుష్ప 2 సినిమా చూస్తుండగా అదుపులోకి
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా విజయాన్నందుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా సత్తా చాటింది. అయితే, పుష్ప సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ని పోలీసు లు చాకచక్యంగా పట్టుకున్నారు. నాగ్‌పూర్‌లో సినిమా చూస్తున్న సమయంలో డ్రగ్స్, స్మగ్లింగ్, హత్యలతో సంబంధం ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేశారు. రెండు హత్యలు, పోలీసులపై దాడులకు సంబంధిం చి హింసాత్మక చరిత్ర ఉన్న విశాల మెష్రామ్‌ని సినిమా క్లుమైక్స్ టైమ్‌లో థియేటర్ నుంచి అరెస్ట్ చేశారు. ఇతడిపై మొత్తం 27 కేసులు ఉన్నాయి. 10 నెలల నుంచి పోలీసు ల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. సైబర్ నిఘా, సరికొత్త ఎస్‌యూవీ ద్వారా మెష్రామ్ కదలికలను పోలీసులు ట్రాక్ చేశారు. అతను తప్పించుకోకుండా థియేటర్ బయట ఉన్న అతడి వాహనంలోని టైర్లలో గాలి తీసేశారు.