calender_icon.png 13 January, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్‌రేప్

13-01-2025 02:23:13 AM

చేగుంట/వెల్దుర్తి, జనవరి 12: మనిషి రూపంలో ఉన్న కొందరు మృగాలు మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా లైంగికదాడికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఓ కేసు విషయంలో సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తుండగా ఈ సంఘటన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తికి చెందిన గేదె కనబడకుండా పోయిందని ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రామంతాపూర్ స్టేజీ వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తుండగా ఓ మహిళపై అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు ఈ విషయమై ఆరా తీయగా తూప్రాన్‌కు చెందిన సయ్యద్ అఫ్రోజ్, చేగుంటలో హెల్పర్‌గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండీ సోహెల్, చేగుంట గ్రామానికి చెందిన గౌరీ బస్వరాజ్ అనే వ్యక్తులు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వెనక గల గద్దెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు గుర్తించినట్లు రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్  తెలిపారు.