calender_icon.png 20 January, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్యారిస్‌లో గ్యాంగ్‌రేప్

25-07-2024 01:30:45 AM

  • ఆస్ట్రేలియన్‌పై ఐదుగురి దారుణం

ఒలంపిక్స్ వేళ కలకలం 

ఫ్యారిస్, జూలై 24: పారిస్‌లో దారుణం జరిగింది. మరికొద్ది గంటల్లో విశ్వక్రీడలు మొదలవుతాయన్న తరుణంలో అక్కడ గ్యాంగ్‌రేప్ కలకలం సృష్టించింది. 25 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించిన ఫ్రెంచ్ పోలీసులు ఇప్పటివరకు ఏ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.  

కబాబ్ షాపులో తలదాచుకుని.. 

తన మీద లైంగికదాడి తర్వాత మహిళ ఓ కబాబ్ షాపులో తలదాచుకుంది. అక్కడి సిబ్బందిని సాయం కోరినట్లు సీసీటీవీలో స్పష్టంగా తెలుస్తోంది. బట్టలు చిరిగి గాయాలతో ఉన్న ఆ మహిళను ఆసుపత్రికి తరలి ంచారు. ఆమె మ్యూజిక్ కాన్సర్ట్ కోసం పారిస్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆది వారం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాల్సి ఉండ గా.. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. దీనిపై ఫ్రెంచ్ పోలీసులతోపాటు ఆస్ట్రేలియన్ కాన్సులేట్  దర్యాప్తు చేస్తున్నారు.  

ఒలింపిక్స్‌కు భద్రమేనా? 

రేపటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఘటనతో పలు అను మానాలు నెలకొన్నాయి. మెగా ఈవెంట్‌కు కొద్దిగంటల ముందు ఈ ఘటనకు వెలుగులోకి రావడంతో అంతా ఆందోళన చెందుతు న్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులు సేఫేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అందుతున్న నివేదికల ప్రకారం 45వేల మందికి పైగా పోలీసులు ప్యారిస్‌లో పహారా కాస్తున్నారు.