కుంభమేళా తొక్కిసలాట నిజంగా దురదృష్టకర పరిణామం. ఇటువంటి దుర్ఘటనలు మున్ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణం ప్రత్యామ్నాయ సేవలపట్ల దృష్టి పెట్టాలి. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉంటుంన్నదున దేశంలోని భక్తులకు పవిత్ర నదీజలాలను వారి ఇండ్లవద్దకే పంపించే ఏర్పాటు ఎందుకు చేయకూడదు? ఇప్పటికైనా మించి పోయింది లేదు.
భారత తపాలా శాఖ, ఇతర శాఖల అధికారుల సహకారంతో కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి, విజయవంతంగా పూర్తి చేయవచ్చు. చిన్న సీసాలలో నీటిని నింపి, తక్కువ ధరకు భక్తులకు అందిస్తే చాలావరకు తాకిడి తగ్గుతుంది. అంతేకాక, పోస్టల్ శాఖవారికీ కొంత ఆదాయం పెరుగుతుంది. అందరికీ ఇదెంతో సౌకర్యంగానూ ఉంటుంది.
శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్