calender_icon.png 22 April, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమిష్టి కృషితో.. అగ్రస్థానంలో గంగారం

19-04-2025 09:39:57 PM

ఆకాంక్షిత డెల్టా ర్యాంకింగ్ లో దేశంలో ప్రథమ స్థానం దక్కించుకున్న గంగారం..

అధికారులను అభినందించిన కలెక్టర్... 

మహబూబాబాద్ (విజయక్రాంతి): నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆకాంక్షిత (ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం) డెల్టా ర్యాంకింగ్ లో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దేశంలోనే అగ్రస్థానం నిలవడానికి అధికారుల సమిష్టి కృషి కారణమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గంగారం మండల స్థాయి అధికారులను అభినందించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గంగారం మండలంలో ఆరోగ్యం విద్య వైద్యం వ్యవసాయం మౌలిక సదుపాయాలు నైపుణ్యాభివృద్ధి తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పురోగతి సాధించే విధంగా కృషి చేయడం వల్ల దేశంలో గంగారం మండలం గుర్తింపు పొందిందన్నారు.

నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయడంలో అన్ని శాఖల అధికారులు పనిచేస్తూ 100 శాతం గంగారం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది దేశానికి రోల్ మోడల్ గా చేయాలన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి శ్రీనాథ్ హల్కే ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు డాక్టర్ ప్రత్యూష, ఏవో రాంబాబు ఏటీఎం శ్రీనివాస్ ఎంపీడీవో అప్పారావు ఎంఈఓ రమాదేవి సమిష్టి కృషితో 2024 చివరి త్రైమాసికంలో గంగారం మండలం దేశవ్యాప్తంగా అగ్ర స్థానంలో నిలిచిందని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి గంగారం మండలాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.