- నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశించిన..
- పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన గడుగు
కామారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాం తి): రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ పదవిని తాను తిరస్కరిస్తున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ తెలిపారు. ఇటీవల నిజామాబాద్‌కు చెందిన గంగాధర్‌ను వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభు త్వం నియమించిది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తనకు రాజ్యాగ పదవిని కట్టబెట్టడం వల్ల పార్టీకి దూరంగా ఉండా ల్సి వస్తుందని మంగళవారం తెలిపారు. తాను ఎన్‌ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చానని, తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయని ఆశించినట్లు చెప్పా రు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి గంగాధర్ ఫోన్‌చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.
అయితే ఆయన మొదటి నుంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఆశించారు. గతంలో చాలాకాలంపాటు డీసీసీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయంలో గంగాధర్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఈ నేపథ్యంలో అధిష్టానం గడుగు పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రభుత్వం ప్రకటించిన పదవితో గంగాధర్ నారాజుగా ఉన్నట్లు అతని అనచరులు తెలిపారు.