calender_icon.png 3 March, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మదనం గంగాధర్ డీఎస్పీకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవి కేటాయించాలి..

02-03-2025 07:35:18 PM

తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ క్రాంతికర్ పోకల కిరణ్ కుమార్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): మదనం గంగాధర్ డీఎస్పీ (విఆర్ఎస్) కు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ ప్రాంథిక పోకల కిరణ్ కుమార్ మాదిగ టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం బర్కత్ పుర సామాజిక భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ క్రాంతి కర్పూకల కిరణ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ... మదనం గంగాధర్ డీఎస్పీ(VRS) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ ఉపకులాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. అయితే బెడ బుడగజంగం కులానికి ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించలేదని, ఈ నిర్లక్ష్యనికి ముగింపు పలుకుతూ, సంచార జాతి అయిన బెడ బుడగజంగం కులానికి చెందిన మదనం గంగాధర్ కు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. మదనం గంగాధర్ కు ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటే అట్టడుగు సామాజిక స్థితిలో నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి మదనం గంగాధర్ అని అన్నారు. అత్యంత వెనుకబడిన సమాజం నుంచి వచ్చి, తన కృషితో డీఎస్పీ (DSP) స్థాయికి ఎదిగిన వ్యక్తి అని,బెడ బుడగజంగం (SC) కులానికి చెందిన తొలి పోలీసు అధికారి అన్న ఘనత ఆయనదేనని, పోలీస్ శాఖలో 26 సంవత్సరాలు నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ, దాదాపు 200 అవార్డులు, రివార్డులు అందుకున్నారని తెలిపారు. తన సేవల వల్ల అనేక మంది ప్రజలు లబ్ధి పొందారని, ఉద్యోగాన్ని వదిలి ప్రజా సంక్షేమం కోసం ముందుకొచ్చిన నాయకుడు మదనం గంగాధర్ అని గుర్తు చేశారు. 

అధికారి హోదాలోనే కాకుండా, ప్రజా సేవకుడిగా మారాలని నిర్ణయించుకుని, డీఎస్పీ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారని అన్నారు. ఇది చాలా అరుదైన సంఘటన అని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి, పార్టీ కోసం త్యాగం చేసిన నేత ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మేరకు, ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్ బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు  హామీతో, పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని విరమించుకున్నారని గుర్తు చేశారు. పార్టీ కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టిన వీరికి ఇప్పుడు సముచిత గౌరవం దక్కాలన్నారు. బెడ బుడగజంగం వర్గానికి ఇప్పటివరకు రాజకీయ ప్రాతినిధ్యం లేదని, స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్లుగా బెడ బుడగజంగం (సంచార జాతి) వర్గానికి ఎప్పటికీ రాజకీయ అవకాశం ఇవ్వలేదన్నారు.

ఇది ఓ సామాజిక అన్యాయమని, ఈ అన్యాయానికి పరిష్కారంగా మదనం గంగాధర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం సామాజిక సమతుల్యత కోసం అవసరమని, ఈ నిర్ణయం రాష్ట్రంలో నిర్బలమైన సంచార జాతులకు సముచిత, న్యాయమైన, సమాన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే చర్యగా భావిస్తున్నామన్నారు. ఇదే కాకుండా, ఈ నిర్ణయం సామాజిక సమతుల్యత, అభివృద్ధి, సమగ్ర ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నామని కోరారు. ముఖ్యమంత్రి  సమాజంలోని అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే దేశ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కీలకమని గుర్తించి, వెంటనే ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెడ బుడగజంగం కులానికి చెందిన మదనం గంగాధర్ ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం ఇవ్వాలని దీనికి దళితులు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

భారతీయ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గొల్లపల్లి దయానంద రావు మాట్లాడుతూ... సమాజంలో నేటికీ అత్యంత వెనుకబడినటువంటి రాజకీయంగా నేటికీ ఎలాంటి ప్రాధాన్యత లేని ఎస్సీలలో ఉపకులాలలో అత్యధిక జనాభా కలిగి అన్ని అర్హతలు కలిగి ఉన్న బేడ బుడగ జంగాలకి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మెయిల్ తో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ కి కృతజ్ఞతగా ఉండడానికి అవకాశం ఉందని దీని అధిష్టానం గుర్తించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, కొండరాజు, నందిగంటి కొండలరావు, పుష్పావతి, నవీన్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.