calender_icon.png 22 December, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మైకంలో "గ్యాంగ్ వార్"

14-10-2024 02:10:05 PM

రాళ్ళు,కర్రలతో దాడి ప్రతిదాడులు

పగిలిన తలలు, తీవ్ర రక్తగాయాలు

పోలీసుల అదుపులో "గ్యాంగ్ లు"

జగిత్యాల, (విజయక్రాంతి): మద్యం మైకంలో "గ్యాంగ్ వార్" రాళ్ళు, కర్రలతో దాడి ప్రతి దాడులు చేసుకోగా కొందరి తలలు పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు ఇరు "గ్యాంగ్ లను" అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల తులసి నగర్ లో మద్యం మత్తులో యువకులు  బింగి అనుదీప్ అనే యువకుడి ఇంటికి శ్రీరామ్ నగర్ కు చెందిన యువకుడు తన గ్యాంగ్ తో వచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారు. పాత కక్షలను మనసులో పెట్టుకొని యువకుడు ఫుల్లుగా మద్యం తాగి మరికొందరు యువకులతో కలిసి గ్యాంగ్ ఏర్పడి తులసి నగర్ లో నివాసం ఉంటున్న బింగి అనుదీప్ ఇంటికి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై అనుదీప్ స్నేహితుడు దాడి చేయడంతో హర్షిక్ తలకు తీవ్రగాయాలతో రక్త స్రావమైంది. స్థానికులు కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే అనుదీప్ కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇంట్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దాడులకు పాల్పడుతున్న యువకుల చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని జగిత్యాల పట్టణ పోలీసులు తెలిపారు.