calender_icon.png 25 March, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తి ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఫైటింగ్..!

23-03-2025 01:41:30 PM

ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు

పట్టించుకోని హాస్టల్ వార్డెన్

కల్వకుర్తి: కల్వకుర్తి ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఓ విద్యార్థి తన పెట్టె తాలాన్ని ధ్వంసం చేసి సామాగ్రిని దొంగిలించారని ప్రశ్నించడంతో ప్రశ్నించిన విద్యార్థిని గోడకేసి చితక బాదారు. దీంతో ఆ విద్యార్థికి ఎడమచేతి విరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్టల్ వార్డెన్ ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్టు దయత విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించారు. హాస్టల్లోని 85 మంది విద్యార్థులకు గాను మూత్రశాలలు మరుగుదొడ్లు శుభ్రం చేయకుండా హాస్టల్ పరిసరాల్లోనూ ముక్కుపుటాలాదిరే దుర్వాసన వెదజల్లుతున్న కూడా హాస్టల్ వార్డెన్ పట్టించుకోలేదని విద్యార్థులు మండిపడుతున్నారు.

హాస్టల్‌లో తాగునీరు, బియ్యం, కూరగాయలు సరఫరా విద్యార్థులు చేత హమాలీ పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల చిన్నారుల చేత ఎక్కువ బరువు గల బియ్యం బస్తాలు, కూరగాయల బస్తాలను తరలించడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న లోకేష్ అనే విద్యార్థి ఎస్సీ హాస్టల్‌లో నివాసముంటున్నాడు. కాగా తన పెట్టే తాళాన్ని ధ్వంసం చేసి అందులోని సామాగ్రిని గుర్తుతెలియని తోటి విద్యార్థులు దొంగిలించారని అనుమానం ఉన్న విద్యార్థులను ఆరా తీయడంతో ఆ విద్యార్థిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో ఎడమ చేతి విరిగి అస్వస్థతకు గురయ్యాడు.