12-04-2025 11:57:52 PM
వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేసిన 9 మంది దొంగల ముఠాలో ముగ్గరిని అరెస్ట్ చేయగా, ముగ్గురు పరాలో ఉన్నారని, మరో ముగ్గురు ఇతర కేసుల్లో ప్రస్తుతము జైల్లో ఉన్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీసు హెడ్ కార్టర్స్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలకు సంబంధించి కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతూ జల్సాలకు తిరుగుతూ డిసెంబర్ 12న ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు కు కన్నం వేశారన్నారు.
దొంగలు లోపలికి ప్రవేశించి బ్యాంకులో అమర్చిన మోషన్ డిటెక్షన్ అలారాం సైరన్ రావడంతో దొంగాతoన విఫలమై, పారిపోవడం జరిగిందన్నారు. ఈ కేసు నందు మొత్తం 9 మంది దొంగలు నేరానికి పాల్పడగా, అందులో ముగ్గురు వ్యక్తులు ఈరోజు కచకంటి గ్రామ శివారులో పోలీసులకు అనుమానాస్పదంగ కనిపించగా పట్టుకోగా నేరం అంగీకరించారన్నారు. వారి వద్ద నుండి బ్యాంకు దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపార సాధీనపరచుకున్నట్లు తెలిపారు. నిందితులలో అశోక్, దగడ్ సాయి, మినుగు రాజేశర్ లను అరెస్టు చేశారు. సన్నీ, గోవిందుడు కార్తీక్, చవాన్ రవి ప్రస్తుతం వేరే కేసుల్లో అరెస్టై జైల్లో ఉండగా, పుష్ప, మణికంఠ, జాదవ్ రాజు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పి జీవన్ రెడ్డి, CCS సీఐ చంద్ర శేఖర్,రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై ముజాహిద్, CCS సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.