calender_icon.png 4 April, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నైలో దొంగల ముఠా సమావేశం

23-03-2025 12:16:32 AM

  1. ప్రజల దృష్టి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు
  2. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గవు
  3. బీజేపీ అధ్యక్ష రేసులో లేను
  4. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, మార్చి 22 (విజయక్రాంతి): చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదని, చంబల్ లోయ దొంగల ముఠా సమావేశామనిమ కుమార్ విమర్శించారు. శనివారం ఆయన కరీంనగర్‌లో మీడియా తో మాట్లాడుతూ.. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడిందని, అనేక అవినీతి కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయిందన్నారు.

రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలం తా సిద్ధమయ్యారని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావే శంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని తేలిపోయిందని, కేసీఆర్ కుటుంబం అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోందన్నారు. చెన్నైలో లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారని అన్నారు.

దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుంచి బయటపడే దాని పైనే ఈ సమావేశం నిర్వహించారని అన్నా రు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదని, డీలిమిటేషన్‌పై ఇంతవరకు గైడ్‌లైన్స్ కూడా వెలువడనే లేదన్నారు. దక్షిణాదిలో వికసించేది కమలమేనని, తెలంగా ణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని, నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించారని అన్నారు. 

రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

అకాల వర్షంతో పంట దెబ్బతిన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరులో అకా ల వర్షాని దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ఉమ్మడి కరీనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న, మామిడి పంట దెబ్బతిన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పంట పొలాలను పరిశీలించి, వారం రోజుల్లో పంట నష్టంపై అంచనావేసి రైతులకు పరిహారం అందించాలని కోరారు.