calender_icon.png 23 October, 2024 | 1:49 PM

దొంగల ముఠా అరెస్ట్

23-10-2024 01:21:03 AM

కోదాడ, అక్టోబర్‌౨౨: ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ తీగలను దొంగతనం చేసే ముఠాను సూర్యాపేట జిల్లా మునగాల పోలీసులు అరెస్టు చేశా రు. కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవా రం ఉదయం మొద్దులచెర్వు వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రెండు బైకు లపై వెళ్తున్న అయిదుగురు వ్యక్తులపై అనుమానం వచ్చి విచారించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మం డలం ముప్పారం గ్రామానికి చెందిన  కొంచెం కోటేశ్,  రూపాని గోపి, రూపాని నాగయ్య, వరికుప్పల శ్రీను, కుంచెం విజయ్  ముఠాగా ఏర్పడి గతంలో పలు స్టేషన్ల పరిధి లో ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్లను దొంగిలించారు.

పలు స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి. వీరి వద్ద నుంచి మునగాల స్టేషన్ పరిధిలో 120 కేజీలు, పెన్‌పహాడ్ స్టేషన్ పరిధిలో 50 కేజీల కాపర్ వైర్ రికవ రీ చేసినట్టు వివరించారు. వీటి విలు వ రూ.3.60 లక్షలు ఉంటుందని చెప్పారు. దొంగలను రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబ ర్చిన మునగాల పోలీసులను డీఎస్పీ అభినందించారు.