కామారెడ్డి (విజయక్రాంతి): గాంధారి మండలం చద్మల్ తండాలో కలకలం రేపిన దొంగనోట్ల చలామణి కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం సదాశివనగర్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి, విజయవాడకు చెందిన జగన్ ప్రధాన సూత్రధారులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో గోపాల్, మాలి రవీందర్, సంగ్రామ్, మూడు రవీందర్, చందర్, కిషన్, రామ్ భానుప్రసాద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.1.46 లక్షల విలువైన రూ.500 నోట్లు, రూ.31,400 విలువ చేసే రూ. 200 నకిలీ నోట్లు, 9 ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.