calender_icon.png 17 March, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాచుపల్లిలో గంజాయి సేవిస్తున్న ముఠా అరెస్ట్

17-03-2025 12:50:31 AM

కుత్బుల్లాపూర్, మార్చి 16 (విజయక్రాం తి): బాచుపల్లి  పోలీస్‌స్టేషన్ పరిధిలో  గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సేవిస్తు న్న ఐదుగురు  యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ప్రగతినగర్ మిథిలా నగ ర్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం జీహెచ్‌ఎంసీ పార్క్ నందు శనివారం  కొందరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు బాచుపల్లి సబ్  ఇన్‌స్పెక్టర్ ఉన్నతాధికారుల అనుమతితో పార్క్ వద్దకు తన సిబ్బంది రమేష్, అశోక్‌లతో కలిసి వెళ్లి అనుమానాస్పదంగా పార్క్‌లో కనబడిన ఐదుగురు యువకులను  అదుపులోకి తీసుకున్నారు.

కంభం వేణుగోపాల్ రెడ్డి, అరవపల్లి దుర్గాప్రసాద్, జరపాల ప్రశాంత్ నాయ క్, కసిన తనుజ్ నాగకుమార్, కొంగర సాయిబాలాజీ  అనే ఐదుగురు  యువకుల కు పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లుగా తేలిందని, వారికి కంభం  వేణుగో పాల్ రెడ్డి విక్రయించినట్లుగా గుర్తించి వారి వద్ద మిగిలిన 60 గ్రాముల గంజాయితో  పాటు స్కూటీ,  ఫోన్‌లను స్వాధీనం చేసుకోవడం  జరిగిందని తెలిపారు.గౌలిదొడ్డికి  చెం దిన గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి విక్రయించినట్లుగా కంభం వేణుగోపాల్  అంగీకరించాడని, కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.