మెదక్ జిల్లా (విజయక్రాంతి): మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం గవ్వలపల్లి చౌరస్తాలో రాత్రి చిన్న శంకరంపేట్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి పట్టుకొని విచారించగా మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని నేడు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ హాజరు పరచి వివరాలు వెల్లడిస్తూ మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల నుండి సుమారు 1-8 కిలోల వెండి, ఐదు తులాల బంగారం, కొన్ని ఇత్తడి వస్తువులు కారు, నగదు, స్వాధీన పరుచుకుని వారిని కోర్టులో సరెండర్ చేసినట్టు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించిన రామయంపేట్ సీఐ, శంకరంపేట్ ఎస్సై, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.