calender_icon.png 1 October, 2024 | 8:05 AM

బైక్ చోరీల ముఠా అరెస్టు

01-10-2024 02:10:55 AM

23 బైక్‌లు స్వాధీనం

డీసీపీ సునీతారెడ్డి వెల్లడి

ఇబ్రహీంపట్నం/యాచారం, సెప్టెంబర్ 30: జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను యాచారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు రాచకొండ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సోమవారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.

తలకొండపల్లి మం డలం వెంకట్రావుపేటకి చెందిన దుబ్బ హర్షవర్ధన్ (19) ఈనెల 29న నక్కర్తమేడిపల్లి హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ చేసక్తుండగా స్లెండర్ బైక్‌తో పట్టుబడ్డాడు. వాహనానికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో అతడిని విచారించగా..

బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు. ఐటీఐ చదివిన హర్షవర్ధన్ జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించా లనే ఆశతో నందివనపర్తి గ్రామానికి చెందిన ఎడ్ల రాజు (29), మహమ్మద్ ఆమేర్ (22), మేడిపల్లి గ్రామానికి చెందిన బేత జంగయ్య (32), జాల నాగరాజు (24)తో ముఠాగా ఏర్పడ్డారు.

ఈ ముఠా ఇప్పటివరకు హైదరాబాద్‌లోని అప్జల్‌గంజ్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, మంచాల, యాచారం, హైదరాబా ద్ గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాల్లో పార్కు చేసిన దాదాపు 23 బైక్‌లను దొంగిలించారు.

అతడితోపాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు వారినుంచి 23 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రత్యేక బృందంగా ఏర్పడి దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ తేజం రెడ్డి, కానిస్టేబుల్  శ్రీను, సుందరయ్య, హథిరామ్, నరేందర్‌కు డీసీపీ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు పాల్గొన్నారు.