18-03-2025 02:17:10 PM
హైదరాబాద్: వరంగల్ జిల్లా(Warangal District)లో బాలికలను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా గుట్టురట్టు అయింది. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు లత సహా ఆరుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాలికలతో వ్యభిచారం చేయించేందుకు లత మరో యువతితో కలిసి సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసింది. ఇన్ స్టాగ్రామ్(Instagram) ద్వారా బాలికను ట్రాప్ చేసిన యువతి తన ప్రియుడితో కలిసి బాలికు మద్యం, గంజాయి అలవాటు చేసింది. నర్సంపేట తీసుకెళ్లి బాలికపై ముఠా అత్యాచారం చేసింది. నిందితులు లత, నవ్య, అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, అల్తాఫ్, మీర్జా బేగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.