calender_icon.png 12 March, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ సైబర్ కుట్ర భగ్నం

11-03-2025 01:47:03 PM

పాత సెల్ ఫోన్ కొనుగోలు ముఠా అరెస్ట్

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పాత సెల్ ఫోన్ లే కదా.. అని స్టీల్  సామాండ్లు, ప్లాస్టిక్ డబ్బాలకు అమ్మేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. మీరు అమ్మిన ఫోన్ లతో సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. స్టీల్ డబ్బాల ఆశ చూపి పాత సెల్ ఫోన్ లను కొనుగోలు చేసి, వాటిని బీహార్ లో అమ్మి వేస్తూ సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను ఆదిలాబాద్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(Adilabad District SP Akhil Mahajan) మంగళవారం ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. సైబర్ నేరాలకు పాల్పడే ఆరుగురు ముఠా సభ్యుల్లో ఐదుగురిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారన్నారు. వారి నుండి 2,125 పాత ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలు, 107 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.