calender_icon.png 28 January, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

19-09-2024 07:34:56 PM

నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండుగల ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని IGP V సత్యనారాయణ పత్రికా సమావేశంలో తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిసిన అనంతరం మిలాద్ ఉన్-నబి ర్యాలీ సందర్భంగా  బుధవారం 9:30 గంటల ప్రాంతంలో జెండాలు  కట్టడంలో జరిగిన వివాదంలో రెండు వర్గాలు ఘర్షణ పడి రాళ్లు విసరడం వంటివి జరగగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్, పోలీస్ అధికారులు సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టారు.

ప్రస్తుతం జిల్లా కేంద్రంలో అంత ప్రశాంతంగా ఉందని ఇరువురు మత పెద్దలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మత పెద్దలకు తెలపడం జరిగింది. ఈరోజు ఉదయం ఉమ్మడి జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందితో జిల్లా కేంద్రంలో ప్రజల భద్రతపై భరోసా కల్పించడానికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని ఐజీ తెలిపారు. అనంతరం మిలాద్ ఉన్ నబి ర్యాలికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నత అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. 

జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని సీసీ కెమెరాల ద్వారా 20 మందికిపైగా గుర్తించడం జరిగిందని అట్టి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, చట్టాన్ని ఎవరు ఉల్లంగించరాదని ఐజి తెలిపారు. గౌరవ రాష్ట్ర డిజిపి గారు, లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారి నిరంతరం పర్యవేక్షణలో జిల్లాలో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా త్యరగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని గణేష్ నవరాత్రి ఉత్సవాలు మిలాద్-ఉన్-నబి ర్యాలీలు ప్రశాంతంగా ముగిసినందున అందుకు సహకరించిన ప్రజలకు, వివిధ మతాల మత పెద్దల ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జోగులాంబ జోన్-7 డిఐజి ఎల్ ఎస్ చౌహన్ ఐపిఎస్, జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్, నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ IPS, TSSPA అదనపు డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ ఎన్ లింగయ్య, ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు