calender_icon.png 11 January, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుతంగా గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

06-09-2024 03:52:22 PM

బెల్లంపల్లి ఆర్డిఓ హరికృష్ణ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరు గణేష్ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ కోరారు. శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులతో ఆయన నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్షించారు. గణేష్ మండపాల నిర్వాహకులు ప్రజలకు ఇబ్బంది లేకుండా బస్తీలలో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

గణేష్ నిమజ్జనంలో మున్సిపల్ పరిధిలోని 34 వార్డుల్లో లైటింగ్, శానిటేషన్ ఏర్పాట్లను చేపడతామని మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత తెలిపారు. గణేష్ నిమజ్జనంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మండల తహసీల్దార్ జోష్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ఎన్. దేవయ్య, టూ టౌన్ ఎస్సై కె. మహేందర్ తోపాటు పలువురు కౌన్సిలర్లు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.