calender_icon.png 23 September, 2024 | 12:03 PM

కరీంనగర్లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

08-09-2024 07:10:06 PM

పలు వినాయక మండపాలను సందర్శించిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు

ప్రత్యేక పూజలు చేసి... భక్తులకు అన్నదానం

కరీంనగర్, (విజయక్రాంతి): విగ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు నగర ప్రజలందరి పై ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రెండో రోజు 33, 53 వ డివిజన్ పరిదిలోని పలు వినాయక మండపాలను సందర్శించారు. మొదటగా 33 వ డివిజన్ భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మట్టి గణపతిని దర్శించుకున్నారు. విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి.... మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం అయ్యప్ప దేవాలయం సమీపంలో ఆదర్శ యూత్ క్లబ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాధున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. మరో వైపు భగత్ నగర్ మల్లమ్మ మార్కెట్ సమీపంలో చైతణ్య యూత్ క్లబ్ ఆద్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరున్ని ధర్శించుకొని... ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం ప్రారంభించి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. మరో వైపు 53 వ డివిజన్ కాశ్మీర్ గడ్డ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు.

ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్నేశ్వరునితో పాటు ఆంజనేయ స్వామీని దర్శించుకొని ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక కార్పోరేటర్ తుల శ్రీదేవి చంద్రమౌళి తో కలిసి అన్నదానం ప్రారంభించి వచ్చిన భక్తులకు మేయర్ తన చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా వాడ వాడలో ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ప్రజలు భక్తి పారవశ్యంతో గణనాధులను పూజించి ప్రత్యేక పూజలో మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నగరపాలక సంస్థ ద్వారా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

విగ్రహా ప్రతిష్ట నుండి నిమజ్జనం వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రతి వాడలో మండపాల వద్ద కార్మీకులు పారిశుధ్య పనులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చిన్న విగ్రహాల నుండి భారీ విగ్రహాల వరకు ప్రశాంతంగా విగ్రహాలు అన్ని నిమజ్జనం అయ్యే వరకు నగరపాలక సంస్థ ద్వారా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ముమ్మారం చేస్తున్నామని తెలిపారు. నిమజ్జనం కు ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

పెద్ద విగ్రహాల కోసం క్రేన్లు ఏర్పాట్లు చేయడంతో పాటు చెరువుల చుట్టు భారీకేడింగ్, లైటింగ్ సౌండ్ సిస్టమ్, మంచి నీటి సౌకర్యం పారిశుధ్యం ఇలా అన్ని ఏర్పాట్లు నగరపాలక సంస్థ చేస్తుందని తెలిపారు. నగరంలోని వినాయక  మండప నిర్వహణకులు ప్రజలు తొమ్మిది రోజులు ప్రశాంత వాతావరణం లో సంతోషంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. నగర ప్రజలను గణనాధులు చల్ల చూడాలని వారికి కోరిన కోర్కెలు తీర్చి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాల్లో  మండపాల నిర్వహాకులు ఉయ్యాల శ్రీనివాస్, నరెంధర్, బాలు, జితేందర్, రాజ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.