28-02-2025 12:00:00 AM
న్యూ విజన్ సెల్యూలైడ్స్ బ్యానర్‌పై రవి నాలమ్ నిర్మిస్తున్న తాజాచిత్రం ‘అబ్సెషన్’. ఈ సినిమాకు రాకేశ్ శ్రీపాద దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ గురువారం ఆవిష్కరించారు. పోస్టర్‌ను చూస్తుంటే ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతోంది.
త్వరలోనే మరో అప్డేట్ ఇవ్వనున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. హరీశ్ వినయ్, వీ ధీరజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: వనిధర్‌రెడ్డి; సంగీతం: అనీష్ రాజ్ దేశ్‌ముఖ్; పాటలు: రంజిత్ కడియాల; స్టోరీ-, స్క్రీన్ ప్లే-, డైలాగ్స్-, డైరెక్షన్: రాకేశ్ శ్రీపాద.