calender_icon.png 15 January, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించాలి: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

09-09-2024 08:58:21 PM

కోదాడ,(విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. వర్షాలు వచ్చి బాధపడుతున్న గ్రామాలలో మానవ సేవ మాధవసేవే విధంగా ఎవరికి తోచినంత సాయం చేయాలని చేయాలన్నారు. అనంతరం డిఎస్పి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదని ఎవరైనా డిజేలు పెడితే కేసులు నమోదు చేస్తామని అన్నారు. వాట్సాప్ గ్రూప్ లలో ఏదైనా రెచ్చగొట్టే వీడియోలు పోస్ట్ చేయొద్దు అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసిల్దార్లు సోమపంగు సూరయ్య, ఆంజనేయులు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు,అల్తాప్ హుస్సేన్, కనగల నారాయణ, యాద రమేష్, బొలిశెట్టి కృష్ణయ్య, షేక్ నయం, యేసయ్య, పట్టణ సీఐ రాము, ఎస్సై రంజిత్ రెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు