హైదరాబాద్: వినాయక చవితికి యథాశక్తిగా.. ఉడత భక్తి ..అన్నట్లుగా..ఎవరికి తోచినట్లుగా వారు అదీ.. సామూహికంగా పెద్దలతో పాటు పిల్లలంతా మంటపాల నిర్మాణంలో, మట్టి వినాయకులను తయారు చేయటంలో.. పాల్గొంటారు. అంతే కాదు నిమజ్జనం రోజు తన స్నేహితుడు దూరం అవుతున్నట్లు హృదయ వేదన చెందటం సహజం..కాగా మన దేశంలో మాదిరిగానే జపాన్లో సైతం గణేశుడిని పోలిన దేవుడు న్నాడని హిందూ మతం మాదిరిగా బౌద్ధమతంలో జరిపే కాల చక్ర క్రతువులో భాగంగా 700 పైచిలుకు విగ్రహాలను ఆవాహనం చేస్తారని చెబుతున్నారు. డైషో కంగీటెన్, కంగిటెన్ పేరుతో పిలుచే దేవుళ్లుగా పిలుస్తూ విగ్రహం ఎదురుగా బౌద్ధ మంత్రోచ్ఛారణ, ధ్యానం చేస్తూ కోరికలు కోరుతారని, పండగలు జరుపుకుంటారని జపాన్లో ఆధ్యాత్మిక పర్యటన జరిపిన విశ్వనాథ్ తెలిపారు.
బౌద్ధ దేవతలుగా.. డైషో కంగీటెన్, కంగిటెన్
కంగిటెన్ గా పిలుచుకునే జపనీస్ బౌద్ధమతంలో గౌరవించబడే బౌద్ధ దేవత గణేష్ మాదిరిగానే ఏనుగు తలతో చిత్రీకరిస్తారు. శ్రేయస్సు, అదృష్టం, జ్ఞానం ప్రసాదించే బౌద్ధ దేవతలుగా డైషో కంగీటెన్, కంగిటెన్ పేర్లతో పిలుచే దేవుళ్లుగా ఆరాధిస్తారు. కంగిటెన్ ఆశీర్వాదంతో జపాన్ యువతీ యువకులు తమకు స్పిరిచువల్ పవర్స్ ను ప్రసాదించి కెరీర్ లో అభివృద్ధిని ప్రసాదించాల్సిందిగా కోరుతూ బౌద్ధ ఆలయాలలో జపం, ధ్యానం చేస్తారని తెలిపారు. గణేష్‌డి విగ్రహా్న్ని పెట్టి గణేష్ చతుర్థిలాంటి ఓబోన్ పండుగ (ఆగస్టు నెలలో) తమ పూర్వీకుల ఆత్మలను గౌరవిస్తూ పండగ జరపుకుంటారని విశ్వనాథ్గ్ తెలిపారు. శరదృతువు విషువత్తు రోజు (Autumn Equinox Day,సెప్టెంబర్ 22/23) జపాన్‌లో ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజు శరదృతువు ఆగమనాన్ని సూచిస్తుంది, ఇది గణేష్ చతుర్థి వేడుకల మాదిరిగానే ఉంటుందని ఆయన వివరించారు.