16-02-2025 12:17:15 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రష్యాకు చెందిన ఓ బీవరేజ్ కంపెనీ “రివోర్స్” తమ కంపెనీలో తయారయ్యే బీరు టిన్నులపై భారత జాతిపిత మ హాత్మాగాంధీ ఫొటోలను ముద్రించింది.
కేవలం ఫొటో మాత్రమే కా కుండా ఆయన పేరు, సంతకాన్ని కూడా ఈ టిన్నులపై ముద్రిస్తూ వ స్తోంది. దీంతో ఈ కంపెనీ వ్యవహార శైలిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. రష్యా అధ్యక్షుడి తో చర్చించాలని కోరుతున్నారు.