calender_icon.png 13 March, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ కార్పొరేటర్‌ను పరామర్శించిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

12-03-2025 10:55:05 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యం నుండి కోలుకొని తమ స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ బీఆర్ఎస్(BRS) కార్పొరేటర్ ముఠా పద్మను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ బుధవారం పరామర్శించారు. సందర్భంగా ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  త్వరగా సంపూర్ణ  ఆరోగ్యంతో తిరిగి ప్రజలకు సేవలందించాలని కోరారు. కార్పొరేటర్  తో పాటు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, జి.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.