calender_icon.png 2 October, 2024 | 12:03 PM

అహింసనే ఆయుధంగా మలిచిన యోధుడు గాంధీజీ

02-10-2024 02:53:28 AM

స్మరించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 

జాతిపితకు ముఖ్యమంత్రి ఘన నివాళి 

హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి) : అహింసనే ఆయుధంగా మలిచిన యోధుడు, మానవాళికి మానవత్వం నేర్పిన మహానీయుడు మహాత్మాగాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జాతిపితను స్మరించుకున్నారు.

స్వాతంత్య్ర పోరాట దిక్సూచి, భరతజాతికి స్ఫూర్తి, అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగాను పాటించే మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. 

శాస్త్రి జీవితం అందరికీ ఆదర్శం

జై జవాన్, జైకిసాన్ నినాదం ద్వారా రైతులు, సైనికుల గొప్పతనాన్ని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రపంచానికి చాటి చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. అక్టోబర్ 2న లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

భారత రెండో ప్రధానిగా దేశానికి అందించిన సేవలను కొనియాడారు. రాజకీయ నేతల్లో అరుదైన వ్యక్తిగా, దేశాన్ని అమితంగా ప్రేమించే నాయకుడిగా కీర్తిగడించారని సీఎం అభిప్రాయపడ్డారు. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన గొప్ప నాయకుల్లో శాస్త్రి ఒకరని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.