calender_icon.png 30 October, 2024 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ, కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలా? వీధి రౌడీలా?

13-09-2024 01:00:26 AM

వారు ప్రజలకేం సందేశం ఇస్తున్నారు? 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ  

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మధ్య వివాదంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గురువారం ఓ ప్రకటనలో స్పందించారు. ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా రొడ్డెక్కి దూషిం చుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిద్దరి శాసనసభా సభ్యత్వాలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు  విఘాతం కలగకుండా ఉండాలంటే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల ప్రవర్తన, దూషణలు, చేష్టలను ప్రజలు ఆసహ్యించుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. వారు ప్రజలకేం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని, కానీ మధ్యలో కార్యకర్తలు బలయ్యేది కార్యకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు.