calender_icon.png 10 January, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధారి షూటింగ్ ప్రారంభం

20-12-2024 12:00:00 AM

తాప్సి ప్రధాన పాత్రలో రూపొందనున్న కొత్త చిత్రం షూటింగ్‌కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి మేకర్స్ ‘గాంధారి’ అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక్కడి వరకూ మనకు తెలిసిందే. కొత్త విషయం ఏంటంటే.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో తాప్సీతో పాటు కనికా థిల్లాన్ కూడా భాగం కానున్నారని తెలుస్తోంది. తల్లీబిడ్డల ప్రేమ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించగా, రచయిత్రి కనికా థిల్లాన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. కనికాతో కలిసి పని చేయడం ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుందని తాప్సీ గతంలో వెల్లడించారు. ఒక తల్లిలోని అనిర్వచనీయమైన ప్రేమకు ఈ చిత్రం తార్కాణంగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.