calender_icon.png 1 October, 2024 | 4:58 AM

ఏరియల్ యోగా శిక్షణలో ‘గాంధారి’

01-10-2024 03:07:50 AM

‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’, ‘ఖేల్ ఖేల్ మే’ తర్వాత తాప్సీ పన్ను ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ ‘గాంధారి’ కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తుండగా, కనికా థిల్లాన్ కథను రచించి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుండటం, ఇందులో అందాల నటి యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోందన్న టాక్ రావటంతో దీనిపై భారీ అంచనాలేర్పడుతున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గాంధారిలోని తన పాత్ర కోసం తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఈ శిక్షణపైనే పూర్తిగా దృష్టి సారించినట్టు బాలీవుడ్ వర్గాల ద్వారా వినవస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం గూఢచారిగా యాక్షన్ పాత్రలో నటించిన తాప్సీ మరోమారు తనలోని యాక్షన్ కోణాన్ని తెరపై ప్రదర్శించేందుకు కసరత్తులు చేస్తోంది. శక్తిమంతంగా తయారుకావడమే కాక ఫ్లెక్సిబిలిటీ, స్టామినా ట్రైనింగ్‌తోపాటు ఏరియల్ యోగా (వైమానిక యోగా) సాధనలో పాల్గొంటున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.