29-04-2025 04:33:58 PM
లక్షట్టిపేట: లోక కళ్యాణార్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయంతో పవిత్ర గోదావరి తీరమైన లక్సట్టిపేట, బ్రాహ్మణ వాడలోని శ్రీరామగోకులంలో మే 1వ తేదీ గురువారం శ్రీ వరసిద్ధి వినాయక సహిత శ్రీ రాధాకృష్ణ విగ్రహ స్థాపనలో భాగంగా ఉదయం 8.00 గంటల నుండి 72వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం శివ సంకల్పం చేయడం జరుగుతుంది. పురాణం సుజాత రామన్నల కూతురు, అల్లుడు అయిన మనోరమ గౌతం రాంపెల్లి (మంథని) సౌజన్యం, సంపూర్ణ సహకారంతో జరిగే సహస్ర అభిషేకంలో వందలాది మంది వేద బ్రాహ్మణులు పాల్గొంటారు.
దక్షిణ గంగాగా ప్రసిద్ధి చెందిన గోదావరి తీరాన భూమాతకు ఆభరణమైన గోమాత నిలయమైన శ్రీరామ గోకులంలో శ్రీ గణపతి, రాధాకృష్ణ దివ్య సన్నిధిలో గణపతి సహస్ర అభిషేకం నిర్వహించడం ఎంతో అపురూపం. "సహస్రవర్తనాత్ యం యం కామ మధీతే తం తమనేన సాధయేత్" అని ఉపనిషత్ వాక్యం. అనగా ఎవరైతే ఈ అథర్వ శీర్షిమును వెయ్యి సార్లు పటిస్తారో వారికి కాని పని అంటూ ఏమి ఉండదు. నదీతీరం, గోశాల, స్వామి సన్నిధిలో జరిగే అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 73వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం మే 2వ తేది(శంకర జయంతి), పంచ క్రోస ఉత్తర వాహిని గోదావరి తీరమైన చెన్నూర్ లోని శివాలయం(అంబా అగస్తేశ్వర) లో ఉదయం 8.00 నుండి 74 & 75వ సహస్రం మే 3, 4 రెండు రోజులు హైదరాబాద్ లో సువర్ణ భారతి గోశాల (శ్రీ శ్రీనివాస బంగారయ్య గారి) బైరామలగూడలో జరుగుందని నిర్వాహకులు తెలిపారు.